గోచారం ఉపోద్ఘాతం: గ్రహాలు ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనేది గోచారం. గోచారం అనంగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పంచాంగ శ్రవణం దానితో నవనాయక నిర్ణయం చేసి పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా పడతాయి, పప్పులు, ఉప్పులు, నూనెలు ధరలు ఎలా ఉంటాయి, దేశంలోని రాజకీయ పరిస్థితి ఎలా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. జన్మ సమయం లో గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనేది ఆధారంగా చేసుకుని జాతక చక్రాన్ని తయారు చేస్తారు. అంటే గ్రహాలను ఒక ఫోటో తీసి దాసుకున్నారు అన్నమాట. జన్మ జాతకం లో ఆనాటి గ్రహ స్థితి కి ప్రస్తుతం ఉన్న గ్రహ స్థితి కి మధ్య సంబంధాన్ని కలుపుతూ జీవితంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది అని చెప్పడమే గోచార ఫలితం. గ్రహ సంచారం: గ్రహాలు ఎంత వేగంగా కదులుతాయని అనేది తెలియడం వలన ఫలితం చెప్పే సమయంలో మన పని సునాయాసం అవుతుంది. రవి: ఇంచుమించుగా రవి ఒక రాశి నుండి మరో రాశి కి వెళ్లడానికి 30 రోజుల సమయం పడుతుంది. చంద్రుడు: ఒక రాశి మారడానికి రెండున్నర రోజుల సమయం పడుతుంది. కుజుడు: 45 రోజులనుంచి 6 నెలలోపు రాసి మారుతాడు. అన్ని గ్రహాలు ఖచ్చితమైన వేగంతో అన్ని సందర్భాలలో ఒకే రకంగా వెళతాయని చెప్పలేము. వక్రత్వం: ఖగోళ శాస్త్రం ప్రకారం మనం పరిగణించే నవగ్రహాలలో రాహు కేతువులు ఛాయాగ్రహాలు (నిజానికి అక్కడ ఎటువంటి గ్రహము ఉండదు) మిగిలిన సప్త గ్రహాలూ గ్రహాలుగా పరిగణిస్తారు. గ్రహాలు ఎప్పుడూ సవ్యదిశలో నే వెళుతూ ఉంటాయి కాకపోతే భూమి నుంచి దాన్ని చూస్తే అపసవ్యదిశలో వెళుతున్నట్టు అనిపించడం వల్ల వక్రత్వం ఆపాదిస్తారు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కుజుడు రవి నుంచి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు, ఏ గ్రహము అయినా రవి నుంచి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు వరించే అవకాశం ఉంటుంది. రవి చంద్రులు ఎల్లప్పుడూ వక్రించరు. రాహు కేతువులు ఎల్లప్పుడూ వక్ర మార్గం లోనే సంచరిస్తారు. కుజుడు ఇలా వక్రించి కాలం ఉండడాన్ని కుజ స్తంభన అని అంటారు. బుధుడు: ఇంచుమించుగా ఒక రాశిని 25 నుంచి 40 రోజుల్లో దాటుతాడు. గురుడు: గురుడు ఒక రాశి మారడానికి సంవత్సర కాలం పడుతుంది. గురుడు రాశి మారిన ప్రతిసారి పుష్కరాలు రావడం మనం గమనించవచ్చు. శుక్రుడు: రవి బుధ శుక్రులు పక్క పక్కనే తిరుగుతూ ఇంచుమించుగా 30 నుంచి 40 రోజుల్లో ఒక రాశి దాటుతాడు. శని: ఒక రాశి మారడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ఇతర గ్రహాలతో పోల్చి చూస్తే అత్యంత నెమ్మదిగా తిరిగే గ్రహం అవడంవల్ల దీనిని మంద గ్రహం అని కూడా అంటారు. రాహు కేతువులు: ఒక రాశి మారడానికి ఒకటిన్నర సంవత్సరం పడుతుంది. అది కూడా అపసవ్యదిశలో వెళుతూ ఉంటారు. గోచారం: గోచారం ప్రస్తుతం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మనకి అనేక రకాల జ్యోతిష్యం సాఫ్ట్వేర్లు ఉన్నాయి అలాగే వంద సంవత్సరాల పంచాంగం అంటే ఇవి కూడా వాడొచ్చు. ఇప్పుడు జన్మ జాతకంలో జన్మలగ్నము జన్మ చంద్రుడు ముఖ్యమైనవి. జన్మ లగ్నము, చంద్రుడు నుండి గోచార శని అలానే గోచార గురువు ఎక్కడ ఉన్నాడు. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ సంవత్సరం ఫలితాలను, గోచార రవి కూడా కలుపుకొని మాస ఫలితాలను, ఇతర గ్రహ స్థితిని, గోచార చంద్రుని ఆధారంగా చేసుకొని దిన ఫలితాలను కూడా చెబుతారు. ముగింపు: గోచార ఫలితాలు చెప్పడానికి అష్టక వర్గు, గ్గ్రహబలం వాడుతారు. నేను కొంత పరిశోధన చేసి పాశ్చాత్య జ్యోతిష పద్ధతులు, నక్షత్ర జ్యోతిష్యం గోచారం వంటివి వాడి ఎలా గోచారం చెప్పచ్చు అనే గణన పద్ధతిని తయారు చేశాను త్వరలో దాన్ని ముందుకు తీసుకొస్తాం. Explained about how transit is formed and how it works. in telugu its known as గొచారం. also in next part explained about how lagnam is formed in Telugu. these all topics are based on vedic astrology share your feedback and suggestions, questions as comments. RVA Horoscope https://www.rahasyavedicastrology.com/horoscope/ RVA Astrology Software https://www.rahasyavedicastrology.com/rva-software/ Ruling Planets Motion Chart https://www.rahasyavedicastrology.com/motion-chart/ KP Astrology Software https://www.rahasyavedicastrology.com/kp-software/ Twitter https://twitter.com/RVAastrologers Facebook https://www.facebook.com/RahasyaVedicAstrology Instagram https://www.instagram.com/rahasyavedicastrology/ RVA Telugu https://www.youtube.com/RVATelugu Rahasya Vedic Astrology https://www.youtube.com/RahasyaVedicAstrology #AstrologerHyderabad #TeluguAstrologer #LearnAstrology #BestAstrologerInHyderabad #FamousAstrologerInHyderabad #TeluguAstrologer #LearnAstrology #AstrologerInHyderabad astrologer in hyderabad , best astrologer in hyderabad , famous astrologer in hyderabad , telugu astrologer , learn astrology , telugu astrologer , best telugu astrologer, indian astrologer , best astrologer , learn astrology , learn astrology in telugu LEARN ASTROLOGYLEARN ASTROLOGY IN TELUGULEARN VEDIC ASTROLOGYTELUGU ASTROLOGYASTROLOGER IN HYDERABADTELUGU ASTROLOGERBEST TELUGU ASTROLOGERBEST ASTROLOGER IN HYDERABADFAMOUS ASTROLOGER IN HYDERABADINDIAN ASTROLOGERBEST ASTROLOGERRVA TELUGUVEDIC ASTROLOGY IN TELUGUHOW TRANSIT WORKSHOW TRANSIT FORMEDASTROLOGY TRANSITSHOW TO STUDY TRANSITSABOUT TRANSITSTRANSITS IN 2017LEARIN ASTROLOGY IN TELUGU