ఉపోద్ఘాతం

జ్యోతిష్యం అనేది స్వీయ-సాక్షాత్కారం (సెల్ఫ్ రియలైజేషన్ సబ్జెక్ట్) కలిగించే శాస్త్రం. జ్యోతి అనగా వెలుగు, ఇది మనం జీవితంలో ఎటు వెళ్ళాలో తెలియని చీకటి సమయంలో వెలుగు చూపించేద

జ్యోతిష్యాన్ని ఉపయోగించి గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తుని దేనిని కూడా మార్చలేము. కానీ అది ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. జ్యోతిష్య ఫలితం బట్టి మన ప్రయత్నపూర్వకంగా ఎలా ముందుకెళ్లాలి అనేదానికి మార్గదర్శకంగా ఉంటుంది.

సాంప్రదాయ జ్యోతిష్యం కర్మసిద్ధాంతాన్ని మరియు పూర్వ జన్మను నమ్ముతాయి.

జీవితంలో దృఢ కర్మ ఉన్నప్పుడు ఆ విషయం కచ్చితంగా గా అనుభవించ వలసి వస్తుంది అది ఇది మంచి అయినా చెడు అయినా. మిగిలినది కొంత భాగం ప్రయత్నపూర్వకంగా మనం సాధించొచ్చు. మిగిలిన దానికి ఏటువంటి అడ్డు ఉండదు మనం చేసిన దానికి ఫలితం వస్తుంది.

జ్యోతిష్యం వల్ల ఉపయోగాలు

జ్యోతిష్యం వల్ల గతంలో జరిగిన విషయాలను జ్యోతిష్యం ద్వారా మన జన్మ వివరాలు ఆధారంగా సరి పోల్చుకుని భవిష్యత్తును ఊహించడానికి వీలుపడుతుంది.

ముఖ్యంగా జ్యోతిష్యాన్ని రెండు రకాల ఉపయోగాలకు మనం వాడుకోవచ్చు.

  • మొదటిది ప్రాపంచిక విషయాలను (మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ అఫ్ ది లైఫ్)
  • రెండవది భక్తి మార్గానికి మనల్ని మనం పూర్తిగా ప్రతి సమయంలోనూ కాలాన్ని బట్టి అర్థం చేసుకోవడానికి (స్పిరిచువల్ లైఫ్)

ఏ సందర్భాల్లో జ్యోతిష్యాన్ని ఎలా వాడొచ్చు

మనిషి జీవితాన్ని 12 భావాలతో జ్యోతిష్యం వివరించింది. ఆ ప్రతి సందర్భాన్ని జ్యోతిష్యం ద్వారా మనం ఫలితాన్ని చెప్పొచ్చు కాకపోతే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మనకి తెలిసిన భాష, దాని భావం జ్యోతిష్యం ముందు చాలా చిన్నవి.

ఉదాహరణకు నీటిని కిందకు వదిలితే అవి పల్లానికి వెళ్తాయని చెప్తారు, కానీ నీ కుడి వైపు వెళ్తాయా, ఎడమవైపు వెళ్తాయా అని కొన్ని సందర్భాల్లో చెప్పడం కష్టంగా ఉంటుంది. ఇది కూడా అలాగే అయినప్పటికీ సమయ సందర్భాన్ని బట్టి మరింత లోతుగా అన్వయించి చెప్పవలసి ఉంటుంది.

జీవిత సందర్భాలు

  • ఆరోగ్యం
  • విద్య
  • ఉద్యోగం లేదా వ్యాపారం
  • ధనం
  • స్థిరత్వం, గృహం
  • వివాహం
  • సంతానం
  • ఖర్చులు సమస్యలు
  • దైవం భక్తి

జీవితంలో సందర్భం ఏదైనప్పటికీ కూడా సహజంగా మనం చేసిన నా ప్రయత్నానికి లేదా కష్టానికి తగిన విధంగా ఫలితాన్ని పొందుతాం.

కొన్ని సందర్భాల్లో చేసిన కష్టానికి 10 రేట్లు ఎక్కువగా ఫలితాన్ని పొందుతాం దీన్ని అదృష్టంగా చెప్పవచ్చు.

చేసిన కష్టానికి తగిన ఫలితం పొందడాన్ని కష్ట ఫలితం అనవచ్చు.

పది రెట్లు కష్టానికి కి ఒక రరెట్టు ఫలితాన్ని పొందడం లేక ఫలితం రాకపోవడం దురదృష్టంగా చెప్పొచ్చు.

జ్యోతిష్య పరంగా ప్రతి సందర్భంలో పైన వివరించిన విధంగా మన సమయం ఎలా ఉందో తెలుసుకోవచ్చు.

జ్యోతిష్యం నేర్చుకోవడానికి మార్గాలు

భవిష్యత్తుని చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రతి మార్గంలోనూ కొన్ని అనుకూలతలు మరియు ప్రతికూలతలు ఉంటాయి కానీ మనం మన అవసరాన్ని బట్టి దాన్ని ఉపయోగించుకోవడం మన బాధ్యత.

ఇక్కడ అ ఇంకొక ముఖ్య సమస్య కూడా ఉంది ఏ మార్గం అయినా మనకి పూర్తిగా నేర్పించడానికి ఎవరు ఉండరు, కాబట్టి ఖచ్చితమైన ఫలితం చెప్పడానికి 2 లేదా 3 మార్గాల లో పరిశీలించాల్సి ఉంటుంది.

జ్యోతిష్యం చెప్పడానికి ఉన్న అనేక మార్గాల్లో జన్మ వివరాల ఆధారంగా చెప్పేది ఉత్తమమైన పద్ధతి. ప్రస్తుతానికి దానికి సంబంధించిన పద్ధతులు తెలుసుకుందాం.

జ్యోతిష్యాన్ని మూడు భాగాలుగా విడదీశారు.

సిద్ధాంత భాగం : గ్రహాలు వాటి స్థితి మరియు ఇతర గణితం.

ఫలిత భాగం : జన్మ సమయం ఆధారంగా ఆనాటి గ్రహస్థితిని బట్టి భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం.

ముహూర్త భాగం : జీవితంలో ప్రతి పని సంకల్పంతో మొదలవుతుంది. మూర్తం అనేది సంకల్పానికి కోటి రెట్లు సంకల్పబలం చేకూరుస్తుంది. అంటే ఏ పనిని ఏ కాలంలో చేస్తే ఆ సంకల్పం అంతలా బలపడుతుంది తెలియజేస్తుంది.

జ్యోతిష్యంలో పద్ధతులు

పరాశర జ్యోతిష్యం : ప్రపంచంలో ఉన్న అన్ని జ్యోతిష్య పద్ధతులకి ఇది తల్లి లాంటిది అని చెప్పవచ్చు. దీనిలో గ్రహ స్థితి వల్ల కలిగే ఫలితాలు మరియు కాలాన్ని దశ రూపంలో నిర్ణయించి కలిగే ఫలితాలు ఎలా చెప్పాలి అనే మార్గాలున్నాయి.

జైమినీ జ్యోతిష్యం : పరాశర మహర్షి నుంచి జైమిని మహర్షి నేర్చుకుని తనదైన శైలిలో ఫలిత నిర్ణయాన్ని ఎలా చేయాలని చెప్పడం జరిగింది.

నాడీ జ్యోతిష్యం : రాశి చక్రం 360 డిగ్రీలు అయితే ఒక రాశిని 30 డిగ్రీలు గా నిర్ణయించారు. కానీ నీ ఇక్కడ అ 30 డిగ్రీల అని 150 భాగాలుగా లేదా 300 భాగాలుగా లేదా ఆరువందల భాగాలుగా చేసి ఫలితం నిర్ణయాన్ని సూక్ష్మంగా పరిశీలించి చెప్తారు.

దీనిలో లో చాలామంది మహర్షులు అనేక రకములుగా రాసి ఉండడం జరిగింది. బ్రుగు నంది నాడీ, శివ నాడీ, తుల్య నాడీ, అగస్య నాడీ, మంత్ర నాడీ, తంత్ర నాడీ ఇలా చాలా ఉన్నాయి.

కృష్ణమూర్తి పద్ధతి : కృష్ణమూర్తి పద్ధతి లో ముఖ్యంగా ప్రశ్న జ్యోతిష్యం చెప్పడానికి వాడుతారు. ప్రశ్న జ్యోతిష్యం అనగా ఒకే ఒక ముఖ్య విషయం (వివాహం, ఉద్యోగం) గురించి ఖచ్చితంగా ఏమౌతుంది ఎప్పుడు అవుతుంది అని విషయం తెలుసుకోవచ్చు ఇది కూడా జన్మ వివరాలు లేకుండా తెలుసుకోవచ్చు.

పాశ్చాత్య జ్యోతిష్యం : రెండు గ్రహాల మధ్య దూరం ఆధారంగా ఫలితాన్ని ఏ ఏ సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేది తెలియజేస్తారు ఇది పూర్తిగా మానసిక పరిస్థితి ఎలా ఉంటుందని అంచనా వేసి చెప్తారు. ఈ ఫలితం మానసిక పరిస్థితి బావుంటే ఆ వ్యక్తి సాధిస్తాడని లేకుంటే సాధించలేదని అర్థం అంతేగాని అదృష్టం కలిసిరావడం కర్మ ఇలాంటివి నమ్మరు.

హస్త సాముద్రికం : చేతిలోని రేఖల ఆధారంగా ఫలితం నిర్ణయం చేయడం. అయితే సాంప్రదాయ జ్యోతిష్యం లాగా సూక్ష్మంగా ఫలితాన్ని నిర్ణయించే అవకాశం తక్కువగా ఉంటుంది.

పరిహారాల ు: కర్మ ను కర్మ తోనే తప్పించాలి అనే విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను అందుకే పరిహారం అనేది మందు లాంటిది కాదు అది ఒక అలవాటు అని మనం అర్థం చేసుకోవాలి.

ప్రకృతికి మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. ఒక వ్యక్తికి ఏదో రకంగా సహాయం చేశాను అనుకున్నాం అది మనకి అదే వ్యక్తి అదే రూపంలో సహాయం చేయకపోతే వేరొక రూపంలో అది తిరిగి రావచ్చు.

జ్యోతిష పరంగా అనేక రకాల పరిహారాలు ఉంటాయి అవి భక్తిమార్గంలో లో యంత్ర తంత్ర మంత్ర అ రూపాల్లో ఉంటాయి అవి మనము ఎంతగా అర్థం చేసుకుని ఎలా వాడుతున్నాం అనేది పూర్తి అవగాహన లేకుండా చేయలేం.

జపం, హోమం, తర్పణం, దానం, దేవాలయ దర్శనం వంటివి ఉంటాయి. నేను సహజంగా ఈ మార్గాల కి వ్యతిరేకిని కానప్పటికీ సగటు ప్రజలు జ్యోతిష్య పరంగా ఈ దోషం ఉంది కాబట్టి ఈ పని చేస్తే సరిపోతుంది అనే పద్ధతికి వ్యతిరేకిని.

ఇక్కడ మనం ఒక విషయం పూర్తిగా అర్థం చేసుకోవాలి కర్మ అనేది మనం జన్మ జన్మల నుంచి ఏదో ఒక పని చేయడం వల్ల వస్తోంది అది అది మంచైనా చెడైనా కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకుని మన జీవితంలో సత్కర్మ భాగం చేసుకోవాలి అని నమ్ముతాను.

ముగింపు

మన ముఖ్య ఉద్దేశం ఖచ్చితమైన ఫలితం చెప్పడం అయితే దీనికి కి ఒక మార్గం పూర్తిగా నేర్చుకుంటే సరిపోతుంది కదా అని అనుమానం రావచ్చు కానీ ఇక్కడ అ పూర్తిగా నేర్చుకోవడానికి సరైన గురువు గాని అర్థం చేసుకునే శక్తి గాని మనకి లేకపోవడం అందువల్ల అక్కడ ఉన్న శాస్త్రాన్ని తగినంతగా నేర్చుకొని మిగిలిన పద్ధతులతో పోల్చుకొని ఫలితాన్ని ఖచ్చితంగా పొందొచ్చు.

ఈ కోర్సులో ముఖ్యంగా నేను పరాశర జ్యోతిష్యాన్ని, కృష్ణమూర్తి పద్ధతి, పాశ్చాత్య జ్యోతిష్యాన్ని తెలియజేస్తాను.

సాంప్రదాయ జ్యోతిష్యం సహజంగా మన యొక్క పూర్వ కర్మను బట్టి ఎక్కడ శుభ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేది చెప్తుంది.

పాశ్చాత్య జ్యోతిష్యం నువ్వు ఎప్పుడు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లగలుగుతారు చెప్తుంది.

ఈ రెండు ఒకదానికొకటి విరుద్ధమైనవి అయినప్పటికీ ఈ రెండింటిని కలిపి నేను ఏ విధంగా అద్భుతమైన ఫలితాలను పొందాను మీకు ఒక చిన్న ఉదాహరణ తో చెప్తూ దీన్ని ముగిస్తాను.

ఒక వ్యక్తి బెంగళూరు నుంచి ముంబై వెళ్ళవలసి ఉంది అయితే ఆ వ్యక్తి ఇ ముంబై వెళ్లగలుగుతారు లేదా అనేది సాంప్రదాయ జ్యోతిష్యం చెప్తుంది కానీ ఆ వ్యక్తి ఇ సునాయాసంగా వెళతాడా లేదా కష్టపడుతూ ఇబ్బందిపడుతూ వెళతాడా అనేది సాంప్రదాయ జ్యోతిష్యం చెప్పదు.

పాశ్చాత్య జ్యోతిష్యం ఆ వ్యక్తి ఇ ముంబై చేరుకోగలరు లేదా అనేది చెప్పలేదు కానీ ఆ వ్యక్తి ఇ సునాయసంగా పెడతాడా ఇబ్బందిపడుతూ పెడతాడా అనేది చెప్తుంది ఈ రెండింటినీ కలిపి మనం ఆ వ్యక్తి వెళతాడా లేదని నిర్ణయించి సునాయాసంగా పెడతారా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు.

అంతేకాకుండా నేను జ్యోతిష్యంలో చేసిన నా పరిశోధన మరియు కొన్ని జ్యోతిష్యుల అనుకూలత కొరకు కొంత గణనను సునాయాసంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగకరమైన ఆస్ట్రాలజీ టూల్స్ ఎలా తయారు చేశాను అని విషయాన్ని కూడా పూర్తిగా పంచుకుంటాను.