యోగాలు:

ఒక వ్యక్తి సామాన్యుడు అయినప్పటికీ తనని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లన సందర్భంలో యోగాలు వాళ్ల జాతకచక్రంలో కనబడతాయి.

ఒక గ్రహం సొంత రాశిలో ఉంటూ కేంద్రంలో ఉండడాన్ని, రెండు గ్రహాలు కలవడం గాని యోగం గా చెప్తారు.

యోగం పట్టిన వాళ్ళు ప్రపంచంలో లక్షల మంది ఉంటారు కానీ మనకు అందులో తెలిసిన వాళ్ళు వేలమంది ఉంటారు. లక్షలమందిలో వేల మందికి ఎందుకు యోగం కలిసొచ్చింది మిగతా వారికి ఎందుకు రాలేదు.

ఎందుకంటే వాళ్ళ ప్రతి జాతకంలో కూడా ఏదో ఒక యోగం, ఏదో ఒక సమయం అనుకూలంగా ఉండి ఉండడం వల్లనే వారికి యోగం కలిసి వస్తుంది.యోగలకి అనేక యోగ బంగాలు ఉంటాయి.

ఇంకా అనేక విషయాలు ఉంటాయి. ఇప్పుడు మనం జ్యోతిష్య పరంగా కొన్ని యోగాలు ఎలా ఉంటాయి, ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని తెలుసుకుందాము. రవిచంద్రులు తప్ప మిగిలిన ఐదు గ్రహాల వల్ల ఈ పంచ మహా పురుష యోగం అనేది ఏర్పడుతుంది.

ఈ యోగం ఎలా పడుతుంది అంటే ప్రతి లగ్నానికి కేంద్ర స్థానం లో ఈ గ్రహాలు ఉంటే ఏర్పడుతుంది.

ఉదాహరణకి కేంద్ర స్థానాలు అంటే 1, 4,7, 10. కేంద్ర స్థానాలు. ఇవి ఎప్పుడూ కూడా కష్టపెట్టి ఫలితాన్ని దక్కించుకుంటాయి. ఈ కేంద్ర స్థానంలో కనుక ఈ గ్రహాలు ఉంటే ఆ వ్యక్తి జీవితం కష్టపడి విజయాన్ని సాధిస్తాడు. ఇదే యోగం యొక్క కాన్సెప్ట్.

ఈ కేంద్ర స్థానాల్లో ఆ గ్రహాలు ఉన్నప్పటికీ, ఈ గ్రహాలకి ఆ కేంద్రాలు స్వ క్షేత్రాలు లేక ఉచ్చ క్షేత్రాలు అయి ఉండాలి . ఈ రూల్ మాత్రం మర్చిపోకండి.

ఇప్పుడు ఈ 5 యోగాలు గురించి తెలుసుకుందాము.

  • కుజుడు – రుచిక మహాపురుష యోగం
  • బుద్ధుడు – భద్ర మహా పురుష యోగం
  • గురువు – హంస మహా పురుష యోగం
  • శుక్రుడు – మాలవ్య మహా పురుష యోగం
  • శని – శశి మహా పురుష యోగం

రుచిక మహాపురుష యోగం:

కుజుడు మేషనికి ,వృశ్చికనికి అధిపతి. ఈ యోగం ఏ లగ్నంవారికైనా పట్టొచ్చు. అయితే ఈ యోగం అనేది ఎలా పడుతుందో చూద్దాం.

మనకి ఉన్న రూల్ ఏంటంటే ఆ గ్రహం కేంద్రంలో ఉంటూ ఆ యొక్క గ్రహనికీ స్వక్షేత్ర లేక ఉచ్చ క్షేత్రం అయితే ఈ యోగం వర్తిస్తుంది.

ఉదాహరణకు మేష లగ్నానికి కుజుడు మేషంలో, లగ్నంలో ఉన్నా, దశమంలో మకరంలో ఉన్న రూచిక మహాపురుష యోగం పడుతుంది. ఎందుకంటే లగ్నము మరియు దశమ కేంద్రాలు అవుతాయి. మేషంలో కుజుడు స్వక్షేత్రగతుడు మకరంలో ఉచ్చ పొందుతాడు.

అదే వృషభ లగ్నానికి రచిక మహాపురుష యోగం పట్టాలంటే కుజుడు వృశ్చికంలో ఉంటే మాత్రమే కలుగుతుంది ఎందుకంటే స్వక్షేత్రం అవుతూ కేంద్ర స్థానం (7) కూడా అవుతుంది.

అదే వృషభ లగ్నానికి మకరంలో కుజుడు ఉంటే రుచిక మహాపురుష యోగం ఉండదు. ఎందుకంటే అది 9వ స్థానం అవుతుంది. కేంద్రం కానందువల్ల పొందిన ఉచ్చ పొందినా యోగం పట్టడం లేదు.

అదే వృషభానికి కుజుడు దశమంలో ఉంటే కుంభరాశి కుజుడికి స్వక్షేత్రము లేక ఉచ్ఛ క్షేత్రము కాదు కనుక దశమ కేంద్రం అయినప్పటికీ వృశ్చిక మహాపురుష యోగం పట్టదు.

మిధున లగ్నానికి రుచిక మహాపురుష యోగం అవకాశం ఉందా లేదో చూద్దాం. మిధునానికి కేంద్ర రాశులు మిధునం, కన్య, ధనుస్సు, మీనం. ఈ 4 రాశులు కుజుడుకు స్వక్షేత్ర, ఉచ్చ క్షేత్రాలు కానందువల్ల మిధున నానికి రుచిక మహాపురుష యోగం అవకాశం లేదు.

  • కర్కాటక లగ్నానికి కుజుడు మకరంలో గాని మేషంలో గాని ఉంటే రుచిక మహాపురుష యోగం వర్తిస్తుంది.
  • సింహ లగ్నానికి కుజుడు వృశ్చికం లో ఉంటే రుచిక మహాపురుష యోగం పడుతుంది.
  • కన్యాలగ్నానికి రుచిక మహాపురుష యోగం అవకాశం లేదు.
  • తులా లగ్నానికి కుజుడు మకరంలో గాని మేషంలో గాని ఉంటే యోగం వర్తిస్తుంది.
  • వృశ్చిక లగ్నానికి కుజుడు వృశ్చికంలో ఉంటే రుచిక మహాపురుష యోగం ఉంటుంది.
  • ధనుర్ లగ్నానికి రుచిక మహాపురుష యోగం అవకాశం లేదు.
  • మకర లగ్నానికి కుజుడు మకరం లో గాని మేషం లో గాని ఉంటే రుచిక మహాపురుష యోగం ఉంటుంది.
  • కుంభ లగ్నానికి కుజుడు వృశ్చికంలో ఉంటే రుచిక మహాపురుష యోగమే.
  • మీన లగ్నానికి రుచిక మహాపురుష యోగం అవకాశం లేదు.
పైన చెప్పిన విధంగా అన్ని లగ్నాలకు ఈ రుచిక మహాపురుష యోగం ఎలా ఏర్పడిందో గమనిస్తే మిగిలిన మహాపురుష యోగాలు ఎలా ఏర్పడతాయో మీకు అర్థమవుతుంది.

మరి కొన్ని యోగాలు:

రెండు గ్రహాల కలయిక వల్ల కూడా కొన్ని యోగాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఏ యోగం పట్టాలన్న అవి కేంద్రాల్లో మాత్రమే ఉండాలి. అలాగే ఆ రెండు గ్రహాలలో ఏదో ఒక గ్రహానికి స్వక్షేత్రం గాని ఉచ్చ క్షేత్రంగాని అయి ఉండాలి.

చంద్ర కుజుల కలయిక ను చంద్రమంగళ యోగం అంటారు. గురు కుజుల కలయిక వల్ల గురు మంగళ యోగం ఏర్పడుతుంది. రవి కుజుడు కలయిక వల్ల రవి మంగళ యోగం ఏర్పడుతుంది. రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం అంటారు. గురు చంద్రుల కలయిక గజకేసరి యోగం అంటారు.

కుజుడు వాటి మిత్ర గ్రహాలతో కలిసినప్పుడు ఇలా కొన్ని యోగాలు ఏర్పడ్డాయి. కుజుడు శక్తికి కారకుడు ఎవరితో కలిస్తే వారి యొక్క శక్తిని రెట్టింపు చేసే ప్రయత్నం చేశాడు.

ఉదాహరణకి గురుడు చంద్రుడు కర్కాటకంలో ఉంటూ మేష లగ్నం అయితే అక్కడ అ గజకేసరి యోగం ఏర్పడుతుంది. లగ్నంలో కూడా కుజుడు ఉంటే అప్పుడు వృశ్చిక మహాపురుష యోగం, హంస మహా పురుష యోగం, గజకేసరి యోగం ఇలా 3 మూడు యోగాలు ఏర్పడతాయి.

గజకేసరి యోగంలో గజము అనగా ఏనుగు అడవిలో భారీ శరీరం కలిగి తెలివితేటలు ఉన్న జంతువు. కేసరి అనగా అడవికి రాజైన సింహం ఎంతో శక్తి కలిగిన జంతువు. ఈ రెండు పరస్పర విరుద్ధమైన జంతువులు.

ఈ రెండు జంతువుల గురించి చెప్పాలంటే ఏనుగు నిద్రపోతున్నప్పుడు సింహం కనుక కలలో కనిపిస్తే ఏనుగు చనిపోతుంది. సింహం నిద్రపోతున్నప్పుడు ఏనుగు కలలోకి వస్తే సింహం సరిపోతుంది.

అలాంటి ఈ రెండు జంతువులు ఒకే కంచంలో తింటూ ఒకే మంచం మీద పడుకుంటే మిత్ర తత్వాన్ని కలిగి ఉంటే ఎలాంటి ఫలితాన్నిస్తాయి మనకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి.

గజకేసరి యోగం గురించి మరో చిన్న ఉదాహరణ గురుడు తీయని పంచదారకు అధిపతి. చంద్రుడు పాలక అధిపతి. పాలల్లో పంచదార వేస్తే ఎంత మధురంగా ఉంటుందో ఈ యోగం వల్ల మన జీవితం కూడా అంతే మధురంగా ఉంటుందని అర్థం.

ఈ యోగం చతుర్థంలో ఏర్పడిన అందువలన దానికి సంబంధించిన ఈ విషయంలో శుభఫలితాలు ఇస్తాయి అనగా సంస్థలను నెలకొల్పడం మంచి మంచి గృహాలను కలిగి ఉండడం ఇలాంటివి. వాటికి సంబంధించిన దశ అంతర్దశలు వచ్చినప్పుడు జీవితాన్ని మార్చవచ్చు.

అయితే అయితే ఈ యోగం ఏ విధంగా ఏర్పడింది ఎన్ని డిగ్రీల లో ఏర్పడింది, వాటి కలయిక ఎలా ఉంది, వాటి నక్షత్ర నాథుడు ఎలా ఉన్నాడు, పాపగ్రహ వీక్షణ ఏమన్నా ఉన్నదా, ఇదే యోగం వర్గ చక్రాలలో మరొకసారి ఉందా లేదా ఇలా అనేక విషయాలను ఆధారపడి ఈ యోగం ఎంత వరకు పనిచేస్తుంది అనేది నిర్ణయించాల్సి ఉంటుంది.

ఒక చిన్న ఉదాహరణతో గ్రహ కలయికల వల్ల ఏర్పడే యోగాల గురించి తెలుసుకుందాం. మీరు ఒక్కరే పనిని అద్భుతంగా చేస్తున్నారు. అలాంటి మీకు మీలాంటి ఒక వ్యక్తి చేదోడుగా సహాయం చేస్తే ఎలా ఉంటుంది. అలాంటిది ఇది ఒక పెద్ద సమస్త మీ పని ముందుకెళ్లడానికి సహాయపడితే ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది.

అలాగే రెండు గ్రహాల కలయిక వల్ల వాటి శక్తి రెట్టింపు గాని అంతకంటే ఎక్కువగా ని అవ్వవచ్చు అది అక్కడున్న గ్రహస్థితిని బట్టి అనుకూలంగా కానీ ప్రతికూలంగా గాని ఉండవచ్చు.

ముగింపు:

గ్రంథాలలో కథల రూపంలోనూ, సూత్రం రూపంలోనూ, సిద్ధాంతం రూపంలోనూ, శ్లోకం రూపంలోనూ జ్యోతిష్యం గురించి ఉంటుంది. అయితే మనం దానిని వాడుకోవడానికి వీలుగా ఆచరణ యోగ్యంగా మనం దాన్ని అర్థం చేసుకుంటే చాలా సునాయాసంగా వాడుకోవచ్చు. మనకి గ్రహం కనిపిస్తుంది దాని ఫలితం కనిపిస్తుంది అది ఎలా పని చేస్తుంది అనే అవగాహన స్థాయికి వచ్చినప్పుడే దాన్ని పూర్తిగా వాడుకోగలుగుతాం.

This video explains types of yogas in astrology and how yogas effect life positively and negatively. also discussed about important yogas in vedic astrology. (యోగాలు and పంచ మహాపురుష యోగాలు)

#AstrologerHyderabad #TeluguAstrologer #LearnAstrology #BestAstrologerInHyderabad #FamousAstrologerInHyderabad #TeluguAstrologer #LearnAstrology #AstrologerInHyderabad

astrologer in hyderabad , best astrologer in hyderabad , famous astrologer in hyderabad , telugu astrologer , learn astrology , telugu astrologer , best telugu astrologer, indian astrologer , best astrologer , learn astrology , learn astrology in telugu