LATESTJoin RVA Research for a reading at no-cost. Learn more
Vignana Course

Bhava Analysis

ఉపోద్ఘాతం

రాశి చక్రం 12 భాగాలుగా విభజించబడింది. లగ్నం ఆధారంగా 12 రాశులని లెక్కిస్తే జీవితంలో దక్కేది ఎన్నటికైనా దక్కుతుంది, దక్కనిది ఎన్నటికీ దక్కదు అనే విషయం అర్థమవుతుంది.

ప్రపంచంలో అన్ని విషయాలను గ్రహబలం నిర్ణయించిన తర్వాత ఈ 12 భావాల నుంచి పరిశీలన చేయవచ్చు.

భావబల నిర్ణయానికి సాంప్రదాయ జ్యోతిషంలో అనేక రకమైన పద్ధతులు ఉన్నాయి, కానీ మనం నక్షత్ర జ్యోతిష్యం అనుసరిస్తున్నాం, కనుక కేవలం నా ఉద్దేశాన్ని చెప్పాలనుకుంటున్నాను.

నిజానికి గ్రహాలతో మనకి సంబంధం లేదు, ఆ గ్రహాలు జీవితంలోని విషయాల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందని తెలుసుకోవడానికి గ్రహబలాన్ని లెక్క కట్టి అది ఏ భావంపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అని తెలుసుకోవాల్సి వస్తుంది.

భావాన్ని లెక్కించడం

నా ఉద్దేశంలో భావం అనగా అది తాకగలిగేది అనుభవించగలిగేది అని అర్థం. ముట్టుకోలేనిది యోగంగా పరిగణిస్తాను, ఇంతకుముందు వ్యాసంలో కూడా దీని గురించి చర్చించాం.

ఉదాహరణకు పంచమ స్థానంలో దోషం ఉన్నచో, తెలివితేటలు గొప్పగా ఉన్న సంతానం ఉండకపోవచ్చు.

ఒక భావాన్ని పరిశీలించడానికి ముందుగా ఆ భావానికి ప్రాతినిధ్యం వహించే గ్రహాల యొక్క మూడు విషయాలను ముఖ్యంగా పరిశీలిస్తాను.

1 ) గ్రహం యొక్క కాంతి ( వక్రత్వదోషం )

2 ) గ్రహం నక్షత్రాధిపతి యొక్క స్థానం

3 ) గ్రహబలం ( దిగ్బలం, యోగ కారక)

ఉదాహరణ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీ ప్రయాణం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ఒక వాహనంలో ఇంధనం నింపుకొని బయలుదేరారు, మార్గమధ్యంలో రోడ్డు మార్గం సరిగా ఉండకపోవచ్చు, ఇంధనం అయిపోవచ్చు, ప్రమాదం జరగవచ్చు, ఒక్కోసారి ఇవేవీ జరగకుండా వేరే మార్గం ద్వారా సురక్షితంగా కూడా చేరవచ్చు.

అలాగే ఒక జాతక చక్రంలో మీరు దోషాన్ని పరిశీలించినప్పటికీ, కాలాన్ని మనము దశ ద్వారా సూచిస్తాం కాబట్టి, మహాదశ అనేది బాగున్నప్పుడు సమస్య చిన్నదిగా వచ్చి పరిష్కరించి జీవితంలో ముందుకెళతాం, అదే ఒకవేళ కాలం సహకరించకపోతే కాలచక్రంలో చిక్కుకు పోవాల్సిందే.

మనం ముందుగా జాతకుడికి ఏ విధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అంచనా వేసుకుని, అది ఏ కాలంలో వచ్చే దానికి అవకాశం ఉన్నదనేది, దశ విశ్లేషణ ద్వారా తెలుసుకుంటాం.

మార్గం ఏదైనా గమ్యం ఒక్కటే అని మర్చిపోకూడదు. ఏ జ్యోతిష్య పద్ధతి అనుసరించినా, ఏ రకంగా భావాన్ని విశ్లేషించినా, జాతకుడు జీవితంలో అనుభవం మాత్రం ఒకటే అని మర్చిపోకూడదు.

భావ బలాన్ని లెక్కించే విధానం (Calculation Algorithm)

ఒక భావం యొక్క ఫలితాన్ని అంచనా వేయడానికి మనం L-P-R (Light-Performance-Resource) పద్ధతిని ఆ గ్రహానికి అన్వయించాలి.

Step 1: గ్రహ కెపాసిటీ (Planet Capacity)

ముందుగా ఆ భావంలో ఉన్న గ్రహానికి (Occupant), అధిపతికి (Lord), కారకుడికి (Karaka) విడివిడిగా బలాన్ని లెక్కించాలి.

  • Light (కాంతి): గ్రహం వక్రించిందా? రాహు/కేతువులతో ఉందా? (ఉంటే బలం సున్నా లేదా ఇబ్బందికరం). (Ref Article 11)
  • Performance (పనితీరు): గ్రహం యొక్క నక్షత్రాధిపతి (Star Lord) ఎక్కడ ఉన్నాడు? (Star Lord కి 75% మార్కులు, గ్రహానికి 25% మార్కులు).
  • Resource (వనరు): గ్రహం ఉచ్చలో ఉందా, స్వక్షేత్రంలో ఉందా?

Step 2: భావ స్కోర్ (Bhava Score Calculation)

వచ్చిన మార్కులను 60-20-20 రూల్ ప్రకారం కలపాలి.

సూత్రం: (Occupant × 60%) + (Lord × 20%) + (Karaka × 20%) = Total Bhava Strength

Step 3: లగ్న బలం (Lagna Baseline)

అన్నిటికంటే ముఖ్యం లగ్నం. లగ్న భావం బలంగా ఉంటే, మిగిలిన భావాలకు ఒక 5-10% బూస్ట్ (Boost) ఇస్తాము. లగ్నమే బలహీనంగా ఉంటే, మిగిలిన భావాలు ఎంత బాగున్నా ఫలితం పూర్తిగా దక్కదు.

4. భావము vs యోగము (Bhava vs Yoga)

మరొక కీలకమైన విశ్లేషణ "భావం మరియు యోగం" మధ్య తేడాను గుర్తించడం. ముఖ్యంగా గ్రహాలకు వక్రత్వ దోషం (Retrograde) వచ్చినప్పుడు ఇది జరుగుతుంది.

భావ విశ్లేషణ - ప్రాథమిక సూత్రం (Core Principle)

ఒక భావం (ఉదాహరణకు 10వ ఇల్లు - ఉద్యోగం) బలంగా ఉందా లేదా అని నిర్ణయించడానికి ఈ క్రింది "వెయిటేజ్" (Weightage) పద్ధతిని పాటిస్తాము.

ముఖ్య గమనిక: ఒకవేళ ఆ భావంలో ఏ గ్రహం లేకపోతే (No Occupant), ఆ 60% బలం కూడా భావాధిపతికే (Lord) చెందుతుంది. అప్పుడు అధిపతి పాత్ర 80% అవుతుంది.

How to decide occupant : ?

Ex : 5th house, in case

Rule 0 : Find the powerful planet in the respective house and its star lord give the score.

In case no planets occupied the respective house

Rule 1 – Own Star / Parivarthana

If the planet is in its own star, then sign lord as star lord.

If the planet and its star lord are in each other's stars (Parivarthana), also the respective Sign Lord.

Rule 2 – Exalted / Own Sign

If the planet is in its own sign or exaltation sign, then the planet's original Star Lord.

Rule 3 – Multiple Planets Occupied the star of respective House Lord

If multiple planets occupy the star of the planet under consideration, then House Lord & its star lord will be considered.

Rule 4 – Single Occupant

If only one planet occupies the house lord’s star that planet is under consideration.

Default

If none of the rules apply, the House Lord is the original star lord.

భావం vs హౌస్ (Bhava vs House Rule) - ప్లాసిడస్ సిస్టమ్

సాధారణ జ్యోతిష్యంలో రాశిని బట్టి భావాన్ని నిర్ణయిస్తారు. కానీ ప్లాసిడస్ హౌస్ సిస్టమ్ (Placidus House System) ను ప్రామాణికంగా తీసుకుంటాము. ఒక గ్రహం రాశి చక్రంలో ఒక రాశిలో ఉన్నప్పటికీ, డిగ్రీల పరంగా వేరే భావంలో ఉండే అవకాశం ఉంది.

ఉదాహరణ: మేష లగ్నానికి గురువు 4వ రాశిలో (కర్కాటకం - ఉచ్చ) ఉన్నాడు, కానీ డిగ్రీల పరంగా 3వ భావంలో (ప్లాసిడస్ ప్రకారం) పడ్డాడు అనుకోండి.

విశ్లేషణ: గురువు 3వ భావ ఫలితాలను 75% ఇస్తాడు (ధైర్యం, కమ్యూనికేషన్, ప్రయాణాలు), 4వ రాశి (ఉచ్చ) ఫలితాలను 25% మాత్రమే ఇస్తాడు. కేవలం రాశిని చూసి 4వ ఇంటి ఫలితాలు (సుఖం, ఇల్లు) ఇస్తాడని చెప్పకూడదు.

భావాల వర్గీకరణ & ఫలితాలు (Bhava Classification)

భావాలను వాటి స్వభావం ఆధారంగా విభజించి, ఫలితాలను అంచనా వేయాలి.

భావ విశ్లేషణ - ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ (Step-by-Step)

ఉదాహరణ: తులా లగ్నం. 10వ భావం (కర్మ స్థానం) విశ్లేషణ.

స్థితి: కర్కాటక రాశి (10వ ఇల్లు).

గ్రహాలు: రవి (Sun), బుధుడు (Mercury).

నక్షత్రాలు: పుష్యమి (శని), ఆశ్లేష (బుధుడు).

విశ్లేషణ ప్రక్రియ:

ఆక్యుపెంట్ (60%):

10వ భావంలో రవి, బుధుడు ఉన్నారు.

లీడర్ ఎవరు?

ఎవరూ స్వక్షేత్రం/ఉచ్చలో లేరు.

బుధుడు ఆశ్లేష (స్వనక్షత్రం) లో ఉంటే బుధుడు లీడర్ అవుతాడు.

ఫలితం: బుధుడు వ్యాపార లక్షణాలను ఇస్తాడు.

లార్డ్ (20%):

10వ భావాధిపతి చంద్రుడు (Moon).

చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? చంద్రుడు ఒకవేళ 11వ ఇంట్లో (లాభం) ఉంటే కెరీర్ ద్వారా మంచి లాభాలు వస్తాయి. 6, 8, 12 లో ఉంటే ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటాయి.

కారక (20%):

10వ భావ కారకులు: రవి (Power), బుధుడు (Business), శని (Work), గురువు (Profession).

వీరిలో జాతకంలో ఎవరు బలంగా ఉన్నారో చూడాలి. రవి బలంగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగం లేదా అడ్మినిస్ట్రేషన్. శని బలంగా ఉంటే హార్డ్ వర్క్ లేదా లేబర్ ఓరియెంటెడ్ జాబ్.

ఫైనల్ స్కోర్:

ఆక్యుపెంట్ (రవి+బుధ) బలం + లార్డ్ (చంద్ర) బలం + కారక బలం కలిపి ఆ భావం యొక్క కెపాసిటీని నిర్ణయిస్తాము.

ముఖ్యమైన ప్రత్యేక నియమాలు

విపరీత రాజయోగం: 6, 8, 12 అధిపతులు 6, 8, 12 లోనే ఉంటే విపరీత రాజయోగం. ఇది కష్టాల తర్వాత సడన్ గా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది,.

1-2-11 Rule: ఏ భావం గురించైనా విశ్లేషించేటప్పుడు, ఆ భావానికి సంబంధించిన స్టార్ లార్డ్ (Star Lord) గనుక 1, 2, 11 (లేదా 10) స్థానాల్లో ఉంటే, ఆ ఫలితం ఖచ్చితంగా సిద్ధిస్తుంది,.

ఈ పద్ధతిలో భావాలను విశ్లేషించడం వల్ల జాతక ఫలితాలను చాలా ఖచ్చితంగా (Precision) చెప్పవచ్చు.

ముగింపు

భావ విశ్లేషణలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది: "దక్కేది ఎన్నటికైనా దక్కుతుంది, దక్కనిది ఎన్నటికీ దక్కదు". గ్రహాలు ఏ భావంలో (Placidus ప్రకారం) ఉన్నాయో, వాటి నక్షత్రాధిపతులు ఎక్కడ ఉన్నారో చూసి, 60-20-20 రూల్ అప్లై చేస్తే, ఆ భావం ద్వారా జాతకుడికి సుఖం కలుగుతుందా లేదా దుఃఖం కలుగుతుందా అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు.

వామనుడు శిబి చక్రవర్తిని మూడు అడుగుల నేల అడిగినట్లుగా, మనం గ్రహబలాన్ని, భావ విశ్లేషణ చేసుకొని దశ ఫలితం చెప్పాలి.

మీరు కచ్చితంగా అర్జునుడు పక్షి గుడ్డును చూసి బాణాన్ని సందించినట్టుగా, జ్యోతిష్య ఫలితాన్ని మీరు చెప్పగలరు,అని నేను భావిస్తున్నాను.

మనం చెప్పిన ఫలితాన్ని మరో మారు, మరో రకంగా పరిశీలించడానికి పాశ్చాత్య జ్యోతిష్యం ఎప్పుడు అండగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ముందు వచ్చే పాఠాలలో ఫలితాన్ని నిర్ణయం చేశాక దానిని ఎలా పాశ్చాత్య జ్యోతిష్యంలో కూడా పరిశీలించాలి అనేది తెలియజేస్తాను. అలాగే ఏం మార్గంలో వెళ్లినా నదులు అన్ని సముద్రంలోనే కలుస్తాయని నిరూపిద్దాం.

Ref : https://www.rahasyavedicastrology.com/calc/capacity/

On this pageఉపోద్ఘాతం