లగ్నం ఉపోద్ఘాతం: లగ్నం అంటే ఏంటి అనేది చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఈ రోజు తారీకు అనేది క్యాలెండర్ చూసి తిట్టే చెప్పేస్తాము. కానీ ఇప్పుడే సమయం ఎంత అంటే గడియారం చూడాల్సిందే. అలాగే ఈ రోజు నక్షత్రం ఏమిటి అంటే పంచాంగం చూసి సుమారుగా చెప్పవచ్చు. లగ్నం అంటే సమయం లాంటిది. లగ్నం అనేది తెలిస్తేనే జాతక విశ్లేషణ సులభమవుతుంది. సరైన లగ్నం మరియు లగ్న డిగ్రీలు తెలియకుండా సరైన ఫలితాలు చెప్పడం కుదరదు. లగ్నం ఎలా లెక్కించాలి: గడియారంలో సమయాన్ని గుర్తించినట్లుగా జాతక చక్రం లో సమయాన్ని పరిశీలించడమే లగ్నాన్ని లెక్కించడం. మీకు సునాయాసంగా అర్థం కావడానికి సుమారుగా ఎలా లెక్క కట్టాలి అనేది నేను వివరిస్తాను. నవగ్రహాలలో లో రవి యొక్క చరణం స్థిరమైనది కచ్చితంగా రవి ఈ రాశిలో, ఈ నక్షత్రంలో, ఈ డిగ్రీ లో ఉంటాడు అనేది చెప్పొచ్చు. కాబట్టి దీని ఆధారంగా లగ్నాన్ని లెక్కించవచ్చు. ఇప్పుడంటే మనకి గడియారాలు ఉన్నాయి. పాత కాలంలో సూర్యుడి యొక్క పొద్దున చూసి సునాయాసంగానే సమయాన్ని అంచనా వేసేవారు. సూర్యుడు తూర్పు వైపున ఉదయించినప్పుడు 6:00 AM నడినెత్తి మీదికి వచ్చినప్పుడు 12:00 పడమరన అస్తమించిన అప్పుడు సాయంత్రం 6:00 PM. సూర్యుని ఆధారంగా చేసుకుని లగ్నం ఎలా కట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు ఎప్పుడూ తిరుగుతూ ఉన్నప్పటికీ ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి 30 రోజులు పడుతుంది. అంటే ఒక రాశిలో 30 డిగ్రీలను ఒక్కొక్క డిగ్రీ చొప్పున 30 రోజుల్లో పూర్తి చేస్తాడు. సూర్యుడు జనవరి 14న మకరం లోకి సున్నా డిగ్రీలలో ప్రారంభం అవుతాడు అనుకుందాం. ఫిబ్రవరి 14 కి కుంభంలో 0 డిగ్రీలకు, మార్చి 14 మీనంలో 0 డిగ్రీలకు ఇలా కచ్చితంగా ఉంటాడు. జనవరి 14 న మకర సంక్రాంతి. సూర్యుడు మకర సంక్రమణ రోజున మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఇది మనకి ఎక్కువగా గుర్తుంటుంది అని ఉదాహరణకు తీసుకున్నాను. జనవరి 14న సున్నా డిగ్రీల కి మకరంలో లో జనవరి 20న ఆరవ డిగ్రీ లో ఉంటాడు కదా అలా ఈ తారీకు కైనా ఎక్కడ ఉంటాడు చెప్పొచ్చు. ఇది తెలిస్తే లగ్నం సునాయాసంగా లెక్కించొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి రవి మకరంలో 0 డిగ్రీలకి జనవరి 14న ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఉదయం 6 గంటలకు సుమారుగా సూర్యోదయం అనుకుందాం. ఇప్పుడు రవి ఉన్న డిగ్రీల దగ్గరే లగ్నం ప్రారంభమవుతుంది. అదే రోజున సమయం 8 గంటలు అనుకుందాం. అప్పుడు లగ్నం కుంభంలో 0 డిగ్రీలు అవుతుంది. అంటే అంటే 24 గంటలని 12 రాశులకు రెండు గంటల చొప్పున పంచారు. సూర్యోదయం నుంచి లెక్క మొదలవుతుంది. ఇప్పుడు మరో ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి 24 ఏప్రిల్, 12:00 PM పుట్టాడు అనుకున్నాం. ఇప్పుడు లగ్నం ఎలా లెక్కించాలో చూద్దాం. రవి ఏప్రిల్ 14 కి మేషంలో 0 డిగ్రీలకు కి ఉంటాడు. 24 కి 10 డిగ్రీలు ఉంటాడు. 6:00 AM కి మేషంలో 10 డిగ్రీలకి లగ్నం ఉంటుంది. 8:00 AM కి వృషభంలో 10 డిగ్రీలకి లగ్నం ఉంటుంది. 10:00 AM కి మిధునంలో 10 డిగ్రీలకి లగ్నం ఉంటుంది. 12:00 PM కి కర్కాటకంలో 10 డిగ్రీలకి లగ్నం ఉంటుంది. ఇలా సుమారుగా 12 గంటలకు కర్కాటకంలో లగ్నం ఉంటుంది. అది కూడా లగ్నం 10 డిగ్రీలలో ఉండవచ్చు అని చెప్పవచ్చు. 30 డిగ్రీలను రెండు గంటలతో విడదీస్తే ఒక డిగ్రీ కదలడానికి నాలుగు నిమిషాల సమయం పడుతుంది. 4 x 30 = 120 నిమిషాలు. అయితే ఇదంతా సుమారుగా మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే కచ్చితమైన గణకు ఇంకా కొన్ని విషయాలు local mean time, sidereal time వంటివి ఉంటాయి. ముగింపు: లగ్నాన్ని కచ్చితంగా లెక్కిస్తే నే మనము అన్ని రకాల వర్గ చక్రాలు తయారు చేసుకోవచ్చు. బావ విభజనను అర్థం చేసుకోవచ్చు. అప్పుడే వివాహము ఉద్యోగము ఇలాంటి అనేక విషయాల గురించి విశ్లేషణ చేయవచ్చు. I have explained about how lagna is formed in detailed if you have any questions you can ask me by commenting. #AstrologerHyderabad #TeluguAstrologer #LearnAstrology #BestAstrologerInHyderabad #FamousAstrologerInHyderabad #TeluguAstrologer #LearnAstrology #AstrologerInHyderabad astrologer in hyderabad , best astrologer in hyderabad , famous astrologer in hyderabad , telugu astrologer , learn astrology , telugu astrologer , best telugu astrologer, indian astrologer , best astrologer , learn astrology , learn astrology in telugu