ఉపోద్ఘాతం:

ప్రతి భాషలోనూ భాష నేర్చుకోవడానికి అక్షరాలు పదాలు నేర్చుకోవాలి అప్పుడే మన భావాన్ని భాషలో తెలియజేస్తాం. కానీ మొదట్లో అక్షరాల కి అర్థాలు సరిగ్గా ఎలా వాడు తమ కూడా తెలియదు. కానీ తప్పదు మనం నేర్చుకోవాలి.

జ్యోతిష్యం కూడా ఒక భాష, అలాగే జ్యోతిష్యంలో మనం నేర్చుకున్న ఈ చిన్న చిన్నవి పదాలు మాదిరిగా అన్నమాట.

రాశులు : చర, స్థిర, ద్విస్వభావ

రాశులను అనేక రకాలుగా విభజన చేసి ఉన్నారు అంటే 12 రాశుల లో వున్నా వాటికి అనేక పేర్లు పెడతారు అన్నమాట ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్న విషయాన్ని దానితో అన్వయించి చెప్పాలి కాబట్టి.

చర అంటే కదలడం వెళ్లడం అని అర్థం, స్థిర అంటే కదలనిది జడమైనది, ద్విస్వభావ అంటే పై రెండు గుణాలు కలిగి ఉన్నది. అవసరాన్ని బట్టి ప్రవర్తిస్తుంది.

ఈ పాఠాన్ని నేర్చుకుంటే ఎలా ఉపయోగపడుతుంది అనేది చిన్న ఉదాహరణతో తెలియజేస్తాను.

ఒక వ్యక్తి విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్ళాడు. అప్పుడు ప్రతి ఆరు నెలలకు లేక ప్రతిరోజు తిరగ వలసిన ఉద్యోగం అయిందనుకోండి అది చరరాశి తో సంబంధాన్ని కలిగి ఉండవచ్చు.

అదే వ్యక్తి విదేశాలకు వెళ్ళాక ఐదు కంటే ఎక్కువ సంవత్సరాలు ఒకే దగ్గర లేక ఒకే ఉద్యోగంలో ఉండవలసి వచ్చిందనుకోండి అది స్థిరరాశి తో సంబంధం కలిగి ఉండవచ్చు.

అదే వ్యక్తి విదేశాలకు వెళ్ళాక అవసరాన్ని బట్టి ఆరు నెలల గాని లేక రెండు సంవత్సరాల గాని మా రావాల్సి వస్తుంది అనుకోండి అప్పుడు అది ద్విస్వభావ రాశి సంబంధం వల్ల అయి ఉండవచ్చు.

ఇక్కడ గ్రహాలు దశనాధులు వ్యవహరిస్తాయి కాబట్టి ఇ ఆగ్రహాలు ఈ చర,స్థిర,ద్విస్వభావ రాశుల్లో ఉంటాయి. దశనాథుడు ఏ రాశిలో ఉన్నాడనేది ఫలితం నిర్ణయంలో గమనిస్తాం.

రాశుల విభజన:

మీనం ద్విస్వభావ రాశి మేషం చరరాశి వృషభం స్థిరరాశి మిధునం ద్విస్వభావ రాశి కుంభం స్థిరరాశి

కర్కాటకం చరరాశి మకరం చరరాశి

సింహం స్థిరరాశి ధనస్సు ద్విస్వభావ రాశి వృశ్చికం స్థిరరాశి తుల చరరాశి కన్య ద్విస్వభావ రాశి

ఇలానే కాకుండా రాశులను అగ్ని తత్వ భూతత్వ వాయు తత్వ జలతత్వ రాశులుగా కూడా డ విభజించారు ముందు వచ్చే పాఠం లో లో దాని గురించి తెలుసుకుందాం.

మారక, బాధక స్థానాలు :

జాతక చక్రం లో లగ్నం నుండి 2, 7 స్థానాలను మారక స్థానాలు అంటారు. అంటే ఇవి మరణాన్ని తెలియజేస్తాయి. ఇవే వివాహాన్ని కూడా తెలియజేస్తాయి ఎక్కడ ఎలా వాడాలి అనే విషయం గురించి ఇప్పుడే కంగారు పడకండి ముందుకు వెళ్ళాక మీకే తెలుస్తుంది.

మరణం అనేది మారక, బాధక, చతుర్దశ స్థానం సంబంధం వలన ఏర్పడుతుంది. అయితే బాధక స్థానం ఇబ్బంది పెట్టింది అని అర్థం.

చర లగ్నానికి 11వ స్థానం బాధక స్థానం స్థిర లగ్నానికి తొమ్మిదవ స్థానం బాధక స్థానం ద్విస్వభావ లగ్నానికి ఏడవ స్థానం బాధక స్థానం.

Want to know how Characteristics of rashis రాశులు : చర, స్థిర, ద్విస్వభావ. and how they play role in your predictions ? watch and make comments if you have any questions on this.

#AstrologerHyderabad #TeluguAstrologer #LearnAstrology #BestAstrologerInHyderabad #FamousAstrologerInHyderabad #TeluguAstrologer #LearnAstrology #AstrologerInHyderabad

astrologer in hyderabad , best astrologer in hyderabad , famous astrologer in hyderabad , telugu astrologer , learn astrology , telugu astrologer , best telugu astrologer, indian astrologer , best astrologer , learn astrology , learn astrology in telugu

Chat on WhatsApp