గ్రహ కారకత్వాలు:

మనకి ఏ సినిమాలో అయినా హీరో వ్యక్తిత్వం తెలిస్తేనే అతను ఏ సందర్భంలో ఎలా నడుచుకుంటాడో తెలుస్తుంది.

అలాగే ఒక గ్రహం యొక్క వ్యక్తిత్వం ఒక్కో రాశిలో ఉన్నప్పుడు ఒక్కో నక్షత్రం లో ఉన్నప్పుడు మరో గ్రహం తో కలిసినప్పుడు ఎలా ఉంటుందనేది మనకు తెలిసిన అప్పుడే మనము మరింత గొప్పగా ఫలితాలను చెప్పొచ్చు.

ఉదాహరణకు బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి ఎలా ఉంటాడు అనేది మనందరికీ తెలుసు ఏ సందర్భంలో ఏం చేస్తాడు అనేది కూడా మనకు తెలుసు అలాగే ప్రతి గ్రహం గురించి దాని వ్యక్తిత్వం దాని రంగు దాని ఎత్తు దాని పద్ధతి ఇలా మనకి అన్ని విషయాలు ఎక్కువగా తెలిస్తే అంత గొప్పగా చెప్పచ్చు.

ప్రస్తుతానికి మనం గ్రహాల యొక్క కొన్ని కారకత్వాలు తెలుసుకుందాం రాహు కేతువులు ఛాయాగ్రహాలు అవి ఉన్న రాశిని బట్టి ఫలితాన్నిస్తాయి ముఖ్యంగా సప్త గ్రహాల గురించి తెలుసుకుందాం.

గ్రహాలను వారాల పేర్లతో సునాయాసంగా గుర్తు పెట్టుకోవచ్చు ఆదివారం నుంచి శనివారం వరకు.

గ్రహ కారకత్వాలు:

రవి :

రవి పితృ కారకుడు.

రవి అంటే మహారాజు అంటే మంచి ఎత్తులో మంచి రంగులో ఉండటానికి అవకాశం ఉంటుంది.

సూర్యుడు వెలుగుతూ ఉంటాడు కాబట్టి ఆరోగ్యానికి కారకుడు కాబట్టి ఆరోగ్యంగా మంచి తేజస్సుతో ఉండటానికి అవకాశం ఉంటుంది.

రవి సింహానికి అధిపతి సింహ రాశి అగ్ని తత్వ రాశి కాబట్టి శరీరం కొంత వేడి గా ఉండే దాన్ని కూడా అవకాశం ఉంటుంది.

రవి రాజాగ్రహం రవి కి కోపం వచ్చినప్పుడు తనలోనే దాచుకుంటుంది తన యొక్క ఆధిపత్యం చూపించుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎంతో మంది అధికారులకు తను చేయాలనుకున్నది ఆదేశిస్తాడు. అంతేగాని తనే స్వయంగా ఏది చేయడు.

అందుకే రవి కోపాన్ని మిర్యపు గాటుతో కుజుడి కోపాన్ని ఎండుమిరపకాయ ఘాటుతో పోలుస్తారు. ఎందుకంటే మిరియం తింటే ఆ మంట లోపలే ఉంటుంది అలాగే రవి తన కోపాన్ని బయటికి చూపించాడు కాని కుజుడు బయటకు చూపిస్తాడు

రవి అనగానే గుర్తుకు రావాల్సింది ఆత్మ ఎందుకంటే రవి ఆత్మ కారకుడు. ఆత్మకి మనసుకి చాలా తేడా ఉంటుంది ఆత్మ శాశ్వతమైనది. అర్థం చేసుకోవడానికి మాత్రమే చిన్న ఉదాహరణ చెప్తాను.

రవి గోధుమల కి కారకుడు.

ఉదాహరణకు ఒక చిన్న స్క్రీన్ ఏం తిన్నావ్ అప్పటికప్పుడు ఆ రోజు మీ ఆనందాన్ని పొందుతారు ఇది మానసిక సంతోషం అనుకుందాం. ఒక్కోసారి జీవితానికి సరిపడా ఏ విషయాన్ని అయినా సాధిస్తే అది ఆత్మ తృప్తినిచ్చింది అని అనిపించొచ్చు.

చంద్రుడు:

చంద్రుడు మాతృ కారకుడు.

నీ మనసుకి చంద్రుడు కారకుడు. చంద్రుడు స్త్రీ గ్రహం. క్షీణ చంద్రుడు పాపగ్రహం అవుతాడు, పూర్ణ చంద్రుడు శుభ గ్రహ అవుతాడు.

చంద్రుడు పాలకు నీటికీ మనసుకి ఇలా అనేక విషయాలు కి కారకత్వం వహిస్తాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కి కూడా ఏదో ఒక గ్రహం ఆధిపత్యం కలిగి ఉంటోంది.

కుజుడు:

కుజుడు బాత్రు కారకుడు. వాహనాలకు కుజుడు అధిపతి. కుజుడు చాలా పెద్ద శిల్పి. ఇంజనీర్ కూడా.

కుజుడు భూ కారకుడు అంటే భూమి పుత్రుడు. అలాగే కుజుడు 16 సంవత్సరాల మంచి యుద్ధవీరుడు. రవి గాని కుజుడు గాని పౌరుష గ్రహాలుగా చెబుతారు. కుజుడు చాలా మొండివాడు తను అనుకున్నది సాధించడానికి కోసం సామ దాన దండోపాయాలు ప్రయోగిస్తాడు.

కుజుడు ఎప్పుడు మొహమాటం లేకుండా నేరుగా విషయాన్ని తెలియజేస్తాడు. ఎప్పుడూ సాధించాలనే తపన కలిగి ఉంటాడు. గొడవ కైనా యుద్ధానికి అయినా ఎప్పుడు సిద్ధమే.

కుజుడు ఆకస్మిక విషయాలకీ కారకుడు. ఎందుకంటే యుద్ధంలో ఎవడు ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు కాబట్టి అన్ని ఆకర్షించిందని జరుగుతాయి. దీన్ని మన పరిస్థితిని బట్టి అన్వయించుకోవాలి.

బుధుడు:

బుధుడు బుద్ధి కారకుడు అలాగే వ్యాపార కారకుడు కూడా. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు బుద్ధుడు వ్యాపార ప్రకటనలకు అలాగే మాటలకు ఈ విషయాన్ని ఎదుటి వాళ్ళకి తెలియజేయడానికి అలానే పుస్తకాలకి చదవడానికి కారకుడవుతాడు. లెక్కలకు, పెసర్లు, అనుకరణకు బుద్ధుడే కారకుడు.

బుద్ధుని నపుంసక గ్రహం అని చెబుతారు కాబట్టి ఎప్పుడు డు సాంగత్యం తోనే ఏదైనా చేయగలుగుతారు. బుధుడు తెలివితేటల కారకుడు.

బుద్ధుని యువరాజుగా పరిగణిస్తారు. అలాగే బుద్ధుడు కుమార గ్రహం కూడా. చాలా చిన్న పిల్లవాడు.

గురుడు:

గురుడు పుత్ర కారకుడు, ధన కారకుడు, జ్ఞాన కారకుడు, బుధుడు ఈ విషయాన్ని చదివితే గురుడు చదివిన విషయాన్ని అర్థం చేసుకోవడం జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది.

గురుడు సహజ జాతకచక్రంలో 9 12 స్థానాలకు అధిపతి. తొమ్మిదవ స్థానాధిపతి గా వైజ్ఞానిక అధికారిగా 12వ స్థానాధిపతి గా పూజలకు పురస్కారాలకు అధిపతి గా వ్యవహరిస్తాడు.

గురుడు దేవగురువు పూజలకు, మంత్రాలకు, ఉపదేశాలకు, గౌరవానికి, పేరుకు, నిజాయితీకి మారుపేరు.

గురు వయసు సుమారుగా 60 సంవత్సరాలు అని చెబుతారు. కాబట్టి మంచి చెడు తెలిసి విచక్షణ కలిగి ఉంటాడు. జాతకంలో గురువు బలంగా ఉన్నప్పుడు మంచి విలువల్ని కలిగి ఉంటారు.

లక్ష పాపాలను హరించి కోటి శుభఫలితాలను ఇచ్చే గ్రహం గురు గ్రహం. గురుడు లగ్నంలో గాని దశమంలో గాని పంచమంలో గాని నవమంలో గాని ఉంటే పాపాలను హరిస్తాడు. దీనివలన జీవితంలో అన్ని విషయాలు అనుకున్న జరగవలసిన ఆ సమయంలో జరుగుతాయి.

గురుడు ఎప్పుడు చెడు జరగకుండా కాపాడుతుంటాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి బాగా కోపిష్టి అనుకుందాం. అయినప్పటికీ అతని కోపం వల్ల అతనికి ఇబ్బంది కలగకుండా అతడు మన మంచి కోసమే చెప్తున్నాడు అని అని అనిపిస్తుంది.

శుక్రుడు:

శుక్రుడు కళత్ర కారకుడు. సహజ జాతకచక్రంలో 2, 7 స్థానాలకు అధిపతి. ద్వితీయం ధనాన్ని సప్తమ వివాహాన్ని సూచిస్తుంది.

శుక్రుడు దైత్య గురువు. శుక్రుడు శృంగార పురుషుడు అలంకార ప్రియుడు. అందమైన వాడు.

ఉదాహరణకు సప్తమాదిపతి కి శుక్ర సంబంధం ఉన్న అందమైన భార్య రావచ్చు చతుర్థంలో శుక్రుడున్న అందమైన ఇల్లు ఉండొచ్చు. ఆ జాతక చక్రం లో ఉన్న మిగిలిన గ్రహస్థితి తో అంచనా వేయాల్సి ఉంటుంది.

శుక్రుడు రాజనీతి తెలిసిన అపర చాణిక్యుడు. శుక్రుడు సరదాలకు, సంతోషాలకు, విలాసాలకు పెట్టింది పేరు. శుక్రుడు ఎక్కడ ఉంటే అక్కడ ధనం, అమ్మాయిలు, ఆనందాలు ఉంటాయి. శుక్రుడు సునీత మైన వాడు పరిస్థితులకు తగ్గట్టు అనుకూలంగా ఉంటాడు సునాయాసంగా ఒప్పించవచ్చు.

ఏ గ్రహం యొక్క ఫలితాన్ని అయినా మనము పూర్తిగా గా చూడలేను ఎందుకంటే గ్రహాలు ఏదో ఒక గ్రహం తో కలిసి ఉండటం లేదంటే చూడడం ఇలాంటివి జరగడం వల్ల కాబట్టి పరిస్థితిని బట్టి దాని స్థాయిని అర్థం చేసుకోవాలి.

ఒక వ్యక్తి శరీరం గురించి లగ్నం, లగ్నం నక్షత్రం, చంద్ర నక్షత్రము, అష్టమము బట్టి తెలుసుకోవాలి.

శని:

శని కర్మ కారకుడు, శనిని బంగీ అని పిలుస్తారు, శని యొక్క అన్న గారైనా యముడు కాలు విరగొట్టడం వల్ల కుంటి వాడు అయ్యాడు. బంగి అంటే కుంటివాడు అని అర్థం.

శని మంద గ్రహం కూడా చాలా నెమ్మదిగా నడుస్తాడు. నెమ్మదిగా నడవడం వల్ల ఆలస్యంగా ఫలితం ఇస్తున్నట్టు అనిపిస్తుంది అంతేగాని తన వేగం లో తన ముందుకు వెళుతూ ఉంటాడు కర్మను బట్టి ఫలితాలు ఇస్తాడు.

చంద్రుడు ఒక రాశిని దాటడానికి రెండున్నర రోజులు పడితే శనికి మాత్రం రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శని పడమరకు ఆధిపత్యం వహిస్తాడు, దూర ప్రదేశాలకు ఆధిపత్యం వహిస్తాడు శని నిరంకుశుడు. ఏదైనా ఒక్కడే చేయగలుగుతాడు.

శని ఎప్పుడు నిజమే చెప్తాడు కానీ నీ అది సగం మాత్రమే. శని ఇనుము కి, నూనె కి, నువ్వులకు, శని కూడా ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తి. తక్కువ వయసులో ఎక్కువ కోరికలు వయసు మళ్ళేక వేదాంత ధోరణి భక్తి కలిగిన వ్యక్తి.

శని ఎప్పుడు సమయానుకూలంగా నడుచుకుంటాడు. శని పనికి, పని వారికి కారకుడు. శని బలంగా ఉంటే ఎక్కడ తెలియని వాళ్ళు వచ్చి సహాయం చేస్తారు. ఏ జాతకం అయినా శని కుజులు చాలా ముఖ్యం.

శని రహస్యాలకు కారకుడు. ప్రాణం పోయినా ఈ విషయం ఎవరికీ తెలియజేయడు. అలాగే రహస్యాలను వెలికి తీస్తాడు.శని కష్టపెట్టి ఫలితాన్ని ఇస్తాడు కష్టానికి వెనుకాడడు.

ముగింపు:

ఇప్పటిదాకా గ్రహాలకు సంబంధించిన కొన్ని కారకత్వాలు వాటి యొక్క తత్వం తెలుసుకుందాం. సినిమాలో పాత్రలు లాగా అవి ఎలా నడుచు ఉంటాయో తెలిసింది ఇప్పటిదాకా. ఇకముందు మరింతగా తెలుసుకున్నాం. in this video we will be explaining about గ్రహ కారకత్వాలు (graha karakathvalu) also known as karakas this is based on vedic astrology in telugu i have explianed at my level best if you want to have more detailed explanation on this make comments below in future will make another video on this. share your feedback and suggestions, questions as comments. RVA Horoscope https://www.rahasyavedicastrology.com/horoscope/ RVA Astrology Software https://www.rahasyavedicastrology.com/rva-software/ Ruling Planets Motion Chart https://www.rahasyavedicastrology.com/motion-chart/ KP Astrology Software https://www.rahasyavedicastrology.com/kp-software/ Twitter https://twitter.com/RVAastrologers Facebook https://www.facebook.com/RahasyaVedicAstrology Instagram https://www.instagram.com/rahasyavedicastrology/ RVA Telugu https://www.youtube.com/RVATelugu Rahasya Vedic Astrology https://www.youtube.com/RahasyaVedicAstrology #AstrologerHyderabad #TeluguAstrologer #LearnAstrology #BestAstrologerInHyderabad #FamousAstrologerInHyderabad #TeluguAstrologer #LearnAstrology #AstrologerInHyderabad astrologer in hyderabad , best astrologer in hyderabad , famous astrologer in hyderabad , telugu astrologer , learn astrology , telugu astrologer , best telugu astrologer, indian astrologer , best astrologer , learn astrology , learn astrology in telugu LEARN ASTROLOGYLEARN ASTROLOGY IN TELUGUTELUGU ASTROLOGYASTROLOGER IN HYDERABADTELUGU ASTROLOGERBEST TELUGU ASTROLOGERBEST ASTROLOGER IN HYDERABADFAMOUS ASTROLOGER IN HYDERABADINDIAN ASTROLOGERSIGNIFICATORSLEARN VEDIC ASTROLOGY IN TELUGUVEDIC ASTROLOGY IN TELUGUGRAHA KARAKATHVALUKARAKASPLANETS KARAKAS IN TELUGUSIGNIFICATORS IN TELUGUKARAKAGRAHALUKARAKAS IN ASTROLOGYKARAKAS IN ASTROLOGY TELUGU