ఉపోద్ఘాతం
గ్రహం చూడగలుగుతుంది. చూడగలడ్డాన్ని గ్రహ దృష్టి అంటారు. మనం సహజంగా ఎదురుగా ఉన్న వాటిని చూస్తాం ఒక్కోసారి పక్కన ఉన్న, వెనుక ఉన్న, పైన ఉన్న మెడ తిప్పి అదనంగా చూస్తాం. అలాగే గ్రహాలు కూడా సహజ దృష్టిని, అదనపు దృష్టిని కలిగి ఉంటాయి.
గ్రహ దృష్టి ని తెలుసుకోవడం వల్ల జ్యోతిష్య ఫలితాల్లో కలిగే మార్పుని పరిశీలించడానికి ఉపయోగపడుతుంది.
ఉదాహరణకి కాఫీలో పంచదార వేశాం ఒక రుచి ఉంటుంది ఉప్పు వేస్తే మరో రుచి ఉంటుంది అలాగే ఒక గ్రహం మరో గ్రహానికి చూసినప్పుడు దాని ఫలితం మారవచ్చు దాన్ని మనం గమనించి నిర్ణయించాల్సి ఉంటుంది.
ఒక గ్రహం సహజంగా తానున్న రాశి నుంచి సప్తమ రాశి ని వీక్షిస్తున్న ది. కొన్ని సందర్భాల్లో ఆ సప్తమ రాశి లో ఏ గ్రహం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే గ్రహాన్ని కూడా చూస్తుంది.
గ్రహాలను సులభంగా గుర్తుపెట్టుకోవడానికి వారాల పేర్లు గమనిస్తే సరిపోతుంది.
ఆదివారం భానుడు అంటే రవి, సోమవారం సోముడు సోముడు అంటే చంద్రుడు, మంగళవారం మంగళుడు అంటే కుజుడు, బుధవారం బుదుడు, గురువారం గురుడు, శుక్రవారం శుక్రుడు, శనివారం శని, రాహు, కేతువు.
ఏ గ్రహం ఏ రాశి ని చూస్తే మంచిది ఇది ఏ గ్రహం విగ్రహాన్ని చూస్తే మంచిది అనేది ఫలిత భాగం దాన్ని త్వరలో తెలుసుకుందాం మొదట ఏ గ్రహం ఎలాంటి దృష్టి కలిగి ఉంటుందో తెలుసుకుందాం.
గ్రహ దృష్టులు
ఇన్నర్ ప్లానెట్స్:
రవి – సప్తమ దృష్టి
చంద్రుడు – సప్తమ దృష్టి
బుధుడు – సప్తమ దృష్టి
శుక్రుడు – సప్తమ దృష్టి
అవుటర్ ప్లానెట్:స్
కుజుడు – సప్తమ దృష్టి, చతుర్ధ దృష్టి, అష్టమ దృష్టి
గురుడు – సప్తమ దృష్టి, పంచమ దృష్టి, నవ దృష్టి
శని – సప్తమ దృష్టి, త్రిపాద దృష్టి, దశమ దృష్టి
ఛాయాగ్రహాల:ు
రాహు – అపసవ్య పంచమ దృష్టి కేతువు – అపసవ్య పంచమ దృష్టివిశేష దృష్టి వివరణ:
కుజుడు:కుజుడికి చతుర్ధ అష్టమ విశేష దృష్టి ఉన్నాయి. చతుర్థం సహజంగా కేంద్రం కష్టాన్ని సూచిస్తుంది అలాగే భూమిని సూచిస్తుంది కుజుడు భూమిపుత్రుడు.
కుజుడు యుద్ధ వీరుడు, సహజ అష్టమ రాశి అధిపతి కూడా ఏమైనా సదించడానికి యుద్ధం చేసైనా, దండిచియిన సాధించాలి అనుకుంటాడు.
గురుడు:గురుడికి నవమ దృష్టి ఉంది, ఇది సహజంగా గత జన్మ పుణ్యాన్ని తెలుపుతుంది గురుడు తన 9 వ దృష్టితో ఆ గ్రహం యొక్క పూర్వ పుణ్యము తీసుకురావడం జరుగుతుంది.
గురుడికి పంచమ దృష్టి ఉంది ఇది ప్రస్తుత జన్మలో చెయ్యవు చేయబోతున్న పుణ్యం, అలాగే గత జన్మలో మిగిలిన పూర్వ పుణ్యాన్ని సూచిస్తుంది.
శని:శనికి త్రిపాద దృష్టి ఉంది తృతీయం కర్మను చేతులను సూచిస్తుంది అంటే ఏదైనా నా తన కష్టంతో ముందుకి వెళ్ళవలసి ఉంటుంది.
ఉదాహరణకు శని యొక్క త్రిపాద దృష్టి దశమ అధిపతి మీద ఉంది అనుకుంటే మీ యొక్క ఉద్యోగం మీ కష్టంతోనే మీ ప్రయత్నంతోనే వస్తుంది అంతేగాని వేరొకరి సహాయం ఉండకపోవచ్చు.
శనికి దశమ దృష్టి కూడా ఉంది. శని సహజంగా దశమ స్థానానికి అధిపతి ఉద్యోగానికి కూడా కారకుడు. దశమం కర్మ ను సూచిస్తుంది.
శని కర్మ కారకుడు ఏ గ్రహం మీద అయితే శని యొక్క దృష్టి ఉంటుందో దానికి సంబంధించిన కర్మను ఎప్పుడు మనం పూర్తి చేయవలసి ఉంటుంది లేనిచో కర్మ ఫలితాన్ని పొందవలసి ఉంటుంది.
గ్రహ దృష్టి ఫలితం:
ఉదాహరణకు ఇద్దరు మిత్రులు ఒకరికొకరు చూసుకుంటున్నా మాట్లాడుకుంటున్న అది సంతోష్ అధికమవుతుంది. అలాగే ఇద్దరూ శత్రువు అయితే సమస్యలు ఎదురవుతాయి.
రెండు గ్రహాల మధ్య మిత్రత్వం ఉంటే అవి పరస్పరం చుసుకుంటూ ఉంటే అవి లగ్నము యోగ కారక అయితే శుభఫలితాలు ఇస్తాయి. అవి లగ్న పాపం అయితే అశుభ ఫలితాలు ఇవ్వచ్చు చు కానీ కొన్ని సందర్భాల్లో లో అవి ఉన్న స్థానాలు బట్టి మిగిలిన స్థితిని బట్టి ఫలితాలు మారచ్చు.